మెట్రో స్టేషన్ సమీపంలో అగ్రిప్రమాదం.. పలువురికి గాయాలు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో  శుక్రవారం (నవంబర్ 7) అర్ధరాత్రి దాటిన తరువాత  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్ కు సమీపంలోని బెంగాలీ బస్తీలో సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలు వెంటనే తెలియరాలేదు.

అయితే ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. గాఢ నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా మేల్కొని భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఎటు వెళ్లాలో అర్ధం కాక పలువురు మంటల్లో చిక్కుకుని గాయపడినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో వందల గుడిసెలు దగ్ధమయ్యాయి.  సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది 29 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu