కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలోని టెంట్ సిటీ 19వ సెక్టార్ లో ఆదివారం (జనవరి 19) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  గ్యాస్ సిలిండర్ల పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు దాదాపు 30 టెంట్లకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరగిన వెంటనే స్పందించిన పోలీసులు భక్తులను అక్కడ నుంచి తరలించారు. 

దీంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. కాగా అగ్ని ప్రమాదం సంభవించిన స్థలానికి చేరుకున్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. తొలుత గీతా ప్రెస్ కు చెందిన సెక్టార్ 19లో మంటలు చెలరేగాయి.  ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రయాగ్ రాజ్ కలెక్టర్  తెలిపారు.