పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

posted on: May 21, 2026 11:03AM

 పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో గురువారం(మే 21) ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో  మంటలు వ్యాపించి  వేగంగా భవనం మొత్తానికి విస్తరించాయి.  దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎనిమిది  ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. అయితే భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని అంటున్నారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...