Latest News

చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

posted on: Mar 13, 2026 9:43AM

హైదరాబాద్ చందానగర్ లోనొ ఓ ఫర్నీచర్ గోడౌన్ లో  బుధవారం (మార్చి 12)అర్థరాత్రి దాటిన తరువాత   భారీ అగ్రిప్రమాదం సంభవించింది.   అను ఫర్నిచర్ & ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో  సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఐదు అంతస్తుల భవనంమొత్తం మంటలు వ్యాపించాయి.  8 ఫైర్ ఇంజన్లతో అతికష్టం మీద మంటలను అదుపు చేశారు.

గోదాం మొత్తం ఫర్నిచర్ సామగ్రితో నిండివుండటం తో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేశాయి.  స్థాని కుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీ ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అన్న విషయం వెంటనే తెలియరాలేదు.  అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఈ గోదాంలో ఎవరైనా ఉన్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...