అమీర్ పేటలో భారీ అగ్నిప్రమాదం

posted on: Feb 20, 2026 11:08AM

అమీర్ పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనావేశారు.  భవనం అంతటా దట్టమైన పొగ వ్యాపించడంతో లోపల ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్  భవనంలో  ఈ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా భవనం అంతటికీ విస్తరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

హుటాహుటిక అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనం నుంచి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.  మంటలను అదుపు చేస్తున్నారు. ఇలా ఉండగా ఇంకా కొందరు విద్యార్థులు భవనంలోనే చిక్కుకున్నట్లు బావిస్తున్నారు. భవనంలో ఎంత మంది విద్యార్థులు ఉణ్నారన్నది తెలియరాలేదు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...