లైఫ్ పార్ట్నర్ మానసికంగా మెచ్యురిటీగా ఉన్నారా లేదా..ఇలా తెలుసుకోండి..!


 


మానవ సంబంధాలు చాలా గమ్మత్తైనవి.  కొన్నిసార్లు ఇవి ఆశ్చర్యానికి గురి చేస్తాయి.  మరికొన్ని సార్లు అయోమయానికి,  గందరగోళానికి లోను చేస్తాయి. మరీ ముఖ్యంగా వేర్వేరు జెండర్ ల మధ్య సాగే ప్రేమ,  వైవాహిక బంధం చాలా క్లిష్టమైనది.  ఆపోజిట్ జెండర్ కావడంతో అబిప్రాయాలు,  అభిరుచులు, నిర్ణయాలు,  లక్ష్యాలు.. ఇలా అన్నీ వేర్వేరు గానే ఉంటాయి. అయినా సరే.. వీటన్నింటిని బాలెన్స్ చేసుకుంటూ ఇద్దరూ కలిసి ఉండటమే బార్యాభర్తల బంధానికి స్పెషల్ గుర్తింపును తెచ్చి పెడుతుంది.  భార్యాభర్తల బంధంలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నా అవన్నీ వయసు,  జెండర్ వల్ల కలిగేవని చాలా మంది అనుకుంటారు. కానీ ఏ వ్యక్తి అయినా మానసికంగా మెరుగ్గా లేకపోయినా భార్యాభర్తల బంధంలో సమస్యలు వస్తాయి. లైఫ్ పార్ట్నర్ మానసికంగా పరిణితి చెందిన వారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని విషయాలు బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..

భాగస్వామిని అర్థం చేసుకుని,  విలువ ఇచ్చే లైఫ్ పార్ట్నర్  ఉండటం చాలా ముఖ్యం.    చిన్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు తీరుస్తూ,  తనతో ఉండే వ్యక్తిని సురక్షితంగా ఉంచడం లైఫ్ పార్ట్నర్  బాధ్యత. ఇలా ఉంటే ఏ భార్యాభర్తల బందం అయినా చాలా వరకు సక్సెస్ ఫుల్ గా ఉంటుంది.

భార్యాభర్తల బంధంలో అతి ముఖ్యమైన విషయం  ఒకరికొకరు సపోర్ట్ గా ఉండటం.  ఏ విషయంలో అయినా ఒక్కటిగా ఉండటం, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఒక్కటిగా నిలబడటం.  మానసికంగా మెచ్యురిటీ ఉన్న లైప్ పార్ట్నర్   కష్ట సమయాల్లో మంచి సలహా ఇవ్వడానికి, ప్రతి సంతోషాన్ని కలిసి పంచుకోవడానికి సిద్దంగా ఉంటారు.

నిందలు, గొడవలు లేకుండా  బార్యాభర్తల బంధం  ముందుకు సాగదు. ఒక వ్యక్తి తన తప్పులను,  లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని గొడవలు వచ్చినా భార్యాభర్తల బంధం దృఢంగా ఉంటుంది.

ప్రస్తుత జనరేషన్ లో  ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. మెచ్యురిటీ  చెందిన లైఫ్ పార్ట్నర్  దీనిని అర్థం చేసుకుంటారు.   అవతలి వ్యక్తికి వారి పర్సనల్ స్పేస్ ఇస్తారు. వారి ఇష్టాలను వారికి ఉంచుతారు.

ఏ సంబంధానికైనా నిజాయితీ పునాది. లైఫ్ పార్ట్నర్ తో  ఎంత నిజాయితీగా అంటారో,  వారు తమ పార్ట్నర్ ను ఎంతగా నమ్ముతారు అనే విషయాన్ని వారిలో ఉండే మెచ్యురిటీ స్పష్టం చేస్తుంది.

తాము మాట్లాడే దానికంటే ఎక్కువగా వినే లైఫ్ పార్ట్నర్స్  తమ భాగస్వామిని బాగా అర్థం చేసుకోగలుగుతారట,  అలాగే  వారి గురించి బాగా తెలుస్తుందట. అందువల్ల ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడుకుంటూ, బంధంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ఆరోగ్యకరమైన మార్గంలో పరిష్కరించుకునేవారు చాలా మెచ్యురిటీ చెందిన లైఫ్ పార్ట్నర్స్ గా పిలవబడతారు.
           
ఏ సంబంధంలోనైనా అతి ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ అంటే బహుమతులు ఇవ్వడం లేదా సమయం గడపడం మాత్రమే కాదు. ప్రేమ అనేది మనసుకు సంబంధించినది.   ప్రతి ఒక్కరూ తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక విభిన్నమైన మార్గాన్ని కలిగి ఉంటారు. ప్రేమను వ్యక్తం చేయడం,  తమ భాగస్వామి వ్యక్తం చేసే ప్రేమను అర్థం చేసుకోవడం కేవలం మెచ్యురిటీ ఉన్నవారికి మాత్రమే సాధ్యం.  ఇలా ఉంటే భార్యాభర్తల బందం ఎంతో బాగుంటుంది.

                            *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu