మరి కొద్ది సేపటిలో లోక్ సభలలో నిర్మలమ్మ పద్దు
posted on: Feb 1, 2026 8:50AM

దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్రబడ్జెట్ ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల కారణంగా దేశ ఆర్థిక వృద్ధి మందగించకుండా ఉండటమే లక్ష్యంగా బడ్జెట్ ఉండబోతున్నదని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే టాక్స్ పేయర్స్ కు ఊరట కలిగించేలా బడ్జెట్ ఉంటుందన్న అంచనాలు సైతం ఉణ్నాయి. ఇక గృహ రుణాల వడ్డీపై మినహాయిపును కూడా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అత్యవసర మందులు, కీలక వైద్య పరికరాల దిగుమతిపై సుంకాలు తగ్గంచే అవకాశాలనూ తోసిపుచ్చలేం.
మొత్తం మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులో ఈ రోజు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై భారీ అంచనాలు, ఆశలూ ఉన్నాయి. సామాన్యులు, సంపన్నులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలలోనూ బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఆదివారం (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. దాదాపు గంటన్నర సేపు ఆమె బడ్జెట్ ప్రసంగం ఉంటుంది. ర్చి చివరి నాటికి ఫైనాన్స్ బిల్, అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంది.
ఇక నిర్మలమ్మ పద్దుపై ఆంధ్రప్రదేశ్ బోలెడు ఆశలు పెట్టుకుంది. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అత్యవసరమని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ణప్తి చేసంది. రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్న నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి వేగవంతం ఫార్ములా మేరకు రాష్ట్రానికి భారీ కేటాయింపులు ఉంటాయన్న ఆశాభావంతో ఏపీ ప్రభుత్వం ఉంది.






