Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు రూ. 13 వేల 679 కోట్లు
posted on: Mar 20, 2026 1:02PM
.webp)
తెలంగాణ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర విత్తమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఆయన తన బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు సముచిత బడ్జెట్ కేటాయించారు. తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు కాగా, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు, వృద్ధి రేటు వృద్ధి రేటు 10.2శాతంగా ప్రతిపాదించారు.
మల్లు తన బడ్జెట్ లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి రూ.4,000 కోట్లు
- పంట బీమా పథకానికి రూ.1,886 కోట్లు
- మూసి రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు
- ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు
- ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకానికి రూ.1,056 కోట్లు
- పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు రూ.6,416 కోట్లు
- యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు కేటాయించారు.
అలాగే..
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు
- పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
- బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు
- హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్డుకు రూ1,525 కోట్లు
- రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు కేటాయించారు.
ఇక పోతే...
- కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు
- విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు
- స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు
- రైతు భరోసాకు రూ.18,000 కోట్లు
- చేయూతకు రూ.14,861 కోట్లు
- మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు
- సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు కేటాయించారు.
అలాగే..
- శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు
- గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు
- పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు కేటాయించారు.






