Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫిలింనగర్ ఆలయ భూమి వివాదం మళ్లీ తెరపైకి!
posted on: Jun 23, 2026 4:17PM

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన 2,750 గజాల విలువైన భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ భూమిని స్వామివారి పేరుతోనే నమోదు చేస్తామని గతంలో డీఎస్ఆర్ గ్రూప్ తరఫున సుధాకర్ రెడ్డి స్టాంప్ పేపర్‌పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ భూమిని దేవస్థానం పేరుతో కాకుండా ఎండో మెంట్స్ శాఖ పేరుతో నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
ఇది గతంలో ఇచ్చిన హామీకి విరుద్ధమని, ఆలయ ఆస్తి నేరుగా స్వామి వారి పేరుతోనే కొనసాగాలని వారు స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ నిరసన ను తెలియజేసేందుకు పీఠాధిపతులు, మఠాధి పతులు, హిందూ సంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్ లోని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లి వినతి పత్రం అందించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఆయన నివాసం ఎదుట శాంతియుత నిరసన చేపట్టి "గుట్టపై హనుమాన్.. గుండెల్లో హనుమాన్" అంటూ నినాదాలు చేశారు.
దేవాలయ ఆస్తిని పరిరక్షించడమే నిజమైన భక్తి అని పేర్కొంటూ, గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టి 2,750 గజాల భూమిని అభయాం జనేయ స్వామి పేరుతోనే నమోదు చేయాలని రంజిత్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలను కోరారు. నిరసనకు పలు వురు భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు కూడా మద్దతు తెలపడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే ఈ వివాదంపై మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి లేదా డీఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. భూమి నమోదుపై ప్రభుత్వం లేదా ఎండో మెంట్స్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంద న్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



.webp)


