Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫిఫా వరల్డ్ కప్ 2026: మెస్సీ vs రొనాల్డో మ్యాచ్ సాధ్యమేనా? డ్రీమ్ ఫైట్ ఎప్పుడంటే!
posted on: Jun 12, 2026 10:40AM
.webp)
ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సమరం ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రీడా పండుగ, మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త ఉత్సాహాన్ని మోసుకొచ్చింది. అయితే, ఈ మెగా టోర్నమెంట్‌లో అందరి దృష్టి మాత్రం ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లపైనే కేంద్రీకృతమై ఉంది. వారే ప్రపంచ ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని దాదాపు రెండు దశాబ్దాలుగా శాసిస్తున్న అర్జెంటీనా వీరుడు లియోనెల్ మెస్సీ మరియు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ఈ ఇద్దరు మహా ఆటగాళ్లు తమ కెరీర్‌లో రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ బరిలోకి దిగుతున్నారు. వయసు రీత్యా బహుశా ఇదే వారి చివరి ప్రపంచకప్ కావచ్చు అనే చర్చ అంతటా గట్టిగా సాగుతుండటంతో, ఈ టోర్నీ మరింత భావోద్వేగభరితంగా మారింది.
ఈ క్రమంలో ఫుట్‌బాల్ ప్రేమికులను తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఒక్కటే. ఈ మెగా టోర్నీలో మెస్సీ, రొనాల్డోలు ముఖాముఖి తలపడతారా? క్లబ్ ఫుట్‌బాల్ స్థాయిలో వీరిద్దరూ ఎన్నోసార్లు హోరాహోరీగా తలపడి రికార్డులు సృష్టించినప్పటికీ, ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో తమ జాతీయ జట్ల తరఫున మాత్రం ఒక్కసారి కూడా ఎదురెదురుగా ఆడలేదు. ఈ సుదీర్ఘ నిరీక్షణకు 2026 ఫిఫా ప్రపంచకప్ సరికొత్త ఫార్మాట్ తెరదించేలా కనిపిస్తోంది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం వీరిద్దరి మధ్య డ్రీమ్ క్లాష్ సాధ్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు గ్రూప్-జె లో అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్ జట్లతో కలిసి ఉంది. మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జూన్ 16న అల్జీరియాతో, జూన్ 22న ఆస్ట్రియాతో, జూన్ 27న జోర్డాన్‌తో గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఒకవేళ అర్జెంటీనా తన గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే, జూలై 4న జరిగే ప్రతిష్టాత్మక రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో గ్రూప్-హెచ్ రన్నరప్‌తో పోటీపడుతుంది.
మరోవైపు, రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు గ్రూప్-కె లో డీఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియాలతో కలిసి బరిలోకి దిగుతోంది. పోర్చుగల్ జట్టు జూన్ 17న డీఆర్ కాంగోతో, జూన్ 23న ఉజ్బెకిస్తాన్‌తో, జూన్ 27న కొలంబియాతో తలపడనుంది. పోర్చుగల్ కూడా తన గ్రూప్‌లో టాప్ ప్లేస్‌లో నిలిస్తే రౌండ్ ఆఫ్ 32 లో మరో గ్రూప్ జట్టుతో ఆడుతుంది. మరి ఈ ఇద్దరు మహాయోధులు మైదానంలో ఢీకొట్టాలంటే ఏం జరగాలి? అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలవాలి. ఆ తర్వాత జరిగే రౌండ్ ఆఫ్ 32 మరియు రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ మ్యాచ్‌లలో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఈ రెండు జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తే, క్వార్టర్ ఫైనల్లో మెస్సీ, రొనాల్డోలు ప్రత్యక్ష పోరుకు దిగే సువర్ణ అవకాశం లభిస్తుంది. అదే కనుక జరిగితే ఫుట్‌బాల్ చరిత్రలోనే అది అత్యంత అద్భుతమైన, ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోవడం ఖాయం.
వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే, లియోనెల్ మెస్సీ ఇప్పటికే ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 26 మ్యాచ్‌లు ఆడి, అత్యధికంగా 2314 నిమిషాలు మైదానంలో గడిపిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా, అర్జెంటీనా తరఫున వరల్డ్ కప్‌లో అత్యధికంగా 13 గోల్స్ చేసిన ఘనత కూడా మెస్సీదే. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికంగా 16 గోల్స్ చేసిన జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజే ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టడానికి మెస్సీకి కేవలం 4 గోల్స్ (క్లోజే రికార్డును అధిగమించడానికి మరో 4 గోల్స్, సమానంచేయడానికి 3 గోల్స్) మాత్రమే అవసరం. మరోవైపు, రొనాల్డో ఇప్పటివరకు ప్రపంచకప్‌లలో 8 గోల్స్ మాత్రమే సాధించాడు. క్లోజే రికార్డు అందుకోవాలంటే రొనాల్డో అసాధారణమైన మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ పోర్చుగల్ జట్టు టోర్నీలో సుదీర్ఘంగా ముందుకు సాగితే, ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు ఆడిన కొత్త రికార్డులను తన పేరిట లిఖించుకునే అవకాశం రొనాల్డోకు లభిస్తుంది. భారతీయ అభిమానులు ఈ ఉత్కంఠభరితమైన ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లను యునైట్8 స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు.



.webp)


