Latest News

ఏపీలో పండుగ వాతావరణం కంటిన్యూస్..

posted on: Jan 22, 2026 1:47PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి సీజన్ ఇంకా ముగియలేదు. సంక్రాంతి వెళ్లిపోయినా.. రంగవల్లుల మాసం ఇప్పుడే మొదలైందా అన్నట్లుగా పంగుగ వాతావరణం కొనసాగుతోంది. గత జగన్  ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పండుగలు, పబ్బాల సందర్భంగా సందడీ, సంతోషం కనిపించని పరిస్థితి నుంచి ఇప్పుడు రాష్ట్రం ప్రతిరోజూ పండుగే అన్నట్లుగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం తెలుగుదేశం కూటమి సర్కార్ ఏకకాలంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు వినొద వేడుకలకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తుండటమే. 

జగన్ హయాంలో పాలన అంటే సంక్షేమ కార్యక్రమాల అమలు అంటూ బటన్ నొక్కడం మాత్రమే అన్నట్లుగా సాగింది. అలాగే అధికారం ఉన్నది ప్రత్యర్థులను, తమను వ్యతిరేకించేవారు, తాము ఇష్టపడిన వారిపై దాడులు, దౌర్జన్యాలూ, కేసులూ అన్నట్లుగా సాగిన పరిస్థితి నుంచి ఇప్పుడు తెలుగుదేశం కూటమి సర్కార్ హయాంలో గత 18 నెలలుగా ప్ర‌జ‌ల‌కు ఇటు సంక్షేమం పేరిట సూపర్ సిక్స్ హామీల అమలు, అలాగే అమరావతి, పెలవరం ప్రాజెక్టు సహా పలు అభవృద్ధి కార్యక్రమాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన జరగడమే కాకుండా ఎంటర్ టైన్ మెంట్ ను కూడా ప్రజల దరికి తీసుకువచ్చింది.  న‌గ‌రాలు, ప‌ట్టణాలు, పల్లెల వారీగా ఎంటర్ టైన్ మెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నది. ఇందులో భాగంగానే  గ‌త ఏడాది  విజ‌య‌వాడ ఉత్స‌వ్‌ పేరిట మైసూర్ కు దీటుగా దసరా వేడుకలను నిర్వహించింది.  ఆ త‌ర్వాత‌.. తిరుపతిలో.. ఇలా ఏదో ఒక రూపంలో  రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ వేడుకలు సాగేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఈ వేడుకలలో ప్రజలను మమేకం చేయడం ద్వారా రాష్ట్రమంతటా ఒక ఫెస్ట్ వాతావరణం నెలకొంటున్నది.

 తాజాగా ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, కనువిందు చేసే ప్రకృతి అందాలను ప్రపంచానికి చాటేలా విశాఖ ఉత్సవ్ కు శ్రీకారం చుట్టింది. శనివారం (జనవరి 24) నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకూ విశాఖ ఉత్సవ్ ను నిర్వహించనుంది.   శిఖరం నుంచి సాగరం వరకూ అనే థీమ్ తో  విశాఖ, అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో ఈ ఉత్సవం జరగనుంది. కొద్ది రోజుల ముందే కోససీమ జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జగ్గన తోట తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా  రాష్ట్రంలో ఏడాది పొడవునా జనంలో పండుగ సంతోషాన్ని నింపే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ తెలుగుదేశం కూటమి.. అభివృద్ధి, సంక్షేమం, వేడకలకు సమప్రాధాన్యత ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...