Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇండిగో విమానంలో ప్రయాణికురాలి హల్‌చల్!
posted on: Jun 8, 2026 10:36AM

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసికి బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు కలకలం రేపింది.విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఆమె అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించే ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్లైడ్‌ను తెరవడానికి ప్రయత్నించడాన్ని గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ మహిళ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరవడానికి ఎందుకు ప్రయత్నించింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మరోవైపు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న విమానాన్ని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించారు.



.webp)


