Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అనుమానాస్పద స్థితిలో తండ్రీ కూతుళ్లు సజీవ దహనం
posted on: Mar 18, 2026 12:28PM

హనుమకొండ జిల్లాలో తండ్రీ కూతుళ్లు అనుమానాస్పదస్థితిలో సజీవదహనమయ్యారు. కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్పలో ఈ రోజు తెల్లవారు జామున ఈ ఘోరం జరిగింది. మృతులను రాజశేఖర్, ఆయన కుమార్తె రాజశ్రీగా గుర్తించారు. రాజశ్రీ భర్త ప్రవీణే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కుటుంబ కలహాల కారణంగానే రాజశ్రీభర్త ప్రవీణ్ తన భార్య, మామపై డీజిల్ పోసి నిప్పంటించాడన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాజశ్రీకి ప్రవీణ్‌తో 2023లో వివాహం కాగా, వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.



.webp)


