Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దటీజ్ ధోనీ ... హోరెత్తిన చెపాక్ స్టేడియం
posted on: Mar 23, 2026 9:55AM

మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 సందడి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2026 మెగా టోర్నీ ఈ నెల 28న ప్రారంభం కానున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ రోర్ 2026 పేరుతో చెన్నై చెపాక్ స్టేడియంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వేర్వేరు జట్లుగా ఏర్పడి ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు.
ఈ మ్యాచ్‌కు ధోనీ రావడంతో స్టేడియం హోరెత్తింది. అభిమానులు ధోనీని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్కే ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో మునిగిన సమయంలో ధోనీ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఒక్కసారిగా స్టేడియమంతా ధోనీ నామ స్మరణతో మార్మోగి పోయింది.
అయితే ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అటువంటి ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. అతడిని నేరుగా చూసిన అభిమానులు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు.
ఇప్పటి వరకు సీఎస్కే ఐదు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడిన సంగతి తెలిసిందే. టీమ్ తొలినాళ్లలో ఆడిన సీనియర్ ఆటగాళ్లతో ప్రస్తుత జట్టుకు చెన్నైలో మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్లు మరోసారి మైదానంలోకి దిగి అభిమానులను అలరించారు. వారి ఎంట్రీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్కే తమ ఎక్స్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది.



.webp)


