Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైడ్రా పై తప్పుడు ప్రచారం... కేసు నమోదు
posted on: Apr 14, 2026 10:03AM
.webp)
హైకోర్టు నోటీసుల పేరుతో హైడ్రా పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వివాదాస్పదంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు సమన్లు జారీ అయ్యాయని పేర్కొంటూ ఒక నోటీసు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రచారంపై హైడ్రా అధికారులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసు పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు తప్పుడు సమాచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా రూపొందించిన ఈ నకిలీ నోటిసుల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై దృష్టి సాగించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హైడ్రా అధికారులు.. హైకోర్టు పేరుతో ప్రచారం అవుతున్న ఫేక్ నోటీసుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఈ నకిలీ నోటీసును రూపొందించి ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించే దిశగా విచారణ కొనసాగుతోంది.


.webp)
.webp)


