Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫాల్కన్ యాప్ చీటింగ్ కేసు సీఓ వికాస్ కుమార్ అరెస్ట్
posted on: Feb 25, 2026 7:58PM

భారీ లాభాల పేరుతో అమా యక ప్రజలను మోసం చేసిన ఫాల్కన్ యాప్ స్కాంలో సీఐడీ మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ కుమార్ సఖేర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ కేసులో ఫాల్కన్ చైర్మన్, సీఈఓలను అరెస్ట్ చేసిన సీఐడీ, తాజాగా వికాస్ అరెస్టుతో దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మల్టీనేషనల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాలను డిపాజిటర్లకు పంచుతామని నమ్మబలికిన నిందితులు, ఫాల్కన్ యాప్ ద్వారా భారీగా నిధులు సేకరించినట్టు విచారణలో తేలింది.
అధిక వడ్డీ, తక్కువ సమయంలో డబుల్ రిటర్న్స్ అనే ఆకర్షణీయమైన ఆఫర్లతో ప్రజలను మభ్యపెట్టినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఫాల్కన్ గ్రూప్ దేశవ్యాప్తంగా 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లను సేకరించింది. ఇందులో 4,065 మంది బాధితుల నుంచి రూ.792 కోట్ల మేర మోసం జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. పెట్టుబడుల పేరుతో డబ్బు లు తీసుకున్న తర్వాత లాభాలు ఇవ్వకపోవడంతో బాధితులు ఫిర్యాదులు చేయడంతో ఈ భారీ స్కాం బయటపడింది.
నిందితులు సేకరించిన నిధులను వివిధ ఖాతాలకు మళ్లించి దుర్వి నియోగం చేసినట్టు సీఐడీ అనుమానిస్తోంది. డబ్బుల మార్గాలను ట్రాక్ చేయడా నికి బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ సాక్ష్యాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇంకా పలువురు కీలక వ్యక్తుల పాత్రపై విచారణ కొనసాగుతోందని అధికా రులు తెలిపారు. వికాస్ కుమార్ సఖేర్ అరెస్టుతో ఫాల్కన్ గ్రూప్ కార్యకలాపా లపై మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశముం దని అధికారులు పేర్కొం టున్నారు.. పెట్టుబడిదారు లకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని సీఐడీ స్పష్టం చేసింది. ఈ కేసులోమరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..






