Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేప్ చేసిన బాబా..అరెస్ట్‌కి భయపడి ఆస్పత్రికి..!
posted on: Sep 23, 2017 4:47PM

ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ బాబా జైలుకు వెళ్లిన ఘటన ఇంకా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటన ఆధ్యాత్మిక రంగంలో మాయని మచ్చగా మిగిలింది. ఈ నేపథ్యంలో బాబాలను జనం నమ్మలేని స్థితి దాపురించింది. ఈ పరిణామాల మధ్యలో మరో స్వామిజీ అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. రాజస్థాన్‌కు చెందిన ఫలాహారి బాబా తనపై అత్యాచారం జరిపినట్లు ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
70 ఏళ్ల కౌశేలంద్ర ప్రపన్నచార్య మహరాజ్‌కు రాజస్థాన్‌లో మంచి గుర్తింపు ఉంది. కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవడంతో అతడిని ఫలాహారి బాబాగా పిలుస్తుంటారు భక్తులు. కొద్దిరోజుల క్రితం న్యాయవిద్య చదువుతున్న ఓ 21ఏళ్ల యువతికి ఇంటర్న్‌షిప్ విషయంలో బాబా సాయం చేశాడు. దీంతో స్వామిజీకి కృతజ్ఞతగా ఆశ్రమానికి విరాళం ఇచ్చేందుకు గత నెల 7న ఆ యువతి ఆశ్రమానికి వెళ్లింది. ఆ సమయంలో బాబా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలాహారీ బాబా తనపై అత్యాచారం చేశాడని..ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని సమాచారం అందుకున్న ఫలాహారీ బాబా అనారోగ్యం పేరిట ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి..ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో అక్కడికక్కడే అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు.


.jpg)



