Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నగర చాయ్‌కు కల్తీ నీడ…భారీ రైడ్స్‌లో నకిలీ టీ గ్యాంగ్ అరెస్ట్
posted on: Apr 23, 2026 6:25PM

చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు. అలాంటి నగరంలోనే ఇప్పుడు “నకిలీ చాయ్ పత్తా” కలకలం రేపింది. ఆహార కల్తీ నిఘా విభాగం పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో నకిలీ చాయ్ తయారీ ముఠా బండారం బయటపడింది. ఒకేసారి నగరంలోని 15 ప్రాంతాల్లో దాడులు జరిపిన హెచ్-పాస్ ప్రత్యేక బృందం, ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న 10 మంది సభ్యులను అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి 4,000 కిలోల నకిలీ చాయ్ పత్త,1,500 కిలోల గడువు ముగిసిన టీ పొడి 100 కిలోల నకిలీ నల్ల బెల్లం స్వాధీనం చేసుకోవడం నగరంలో కల్తీ వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తోందో చెబుతోంది.
10మంది కేటుగాళ్లు కలిసి తక్కువ నాణ్యత గల చాయ్ పత్తాలో సింథటిక్ రంగులు కలిపి, ఆకర్షణీయమైన రంగుతో “బ్రాండ్ టీ”లా మార్చి ప్రజలు విశ్వసించే ప్రముఖ బ్రాండ్ల పేర్లు ఉపయోగించి మార్కెట్లో దర్జాగా విక్రయిస్తు న్నారు..
ఈ సింథటిక్ రంగులు స్వీట్లలో మాత్రమే పరిమితంగా వాడాలి. కానీ చాయ్ పత్తాలో ఉపయోగించడం వల్ల కడుపు నొప్పి, అలర్జీలు,జీర్ణ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నకిలీ టీ పౌడర్ ను ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తెచ్చి, నగరంలో ప్రాసెస్ చేసి మార్కెట్లోకి పంపుతున్నట్లు పోలీసులకు విశ్వాసనీయమైన సమాచారం రావడంతో దాడులు చేసి 10మంది కేటుగాళ్లు ను అదుపులోకి తీసుకున్నారు.
కల్తీ ఆహార వ్యాపారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అధికారులు స్పష్టం చేశారు. కల్తీ తయారీ లేదా విక్రయం చేసిన వ్యాపారులపై ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అంతేకా కుండా వినియోగదారులు “చాయ్ కొనేటప్పుడు బ్రాండ్ నిజస్వరూపం, ప్యాకింగ్, వాసన, నాణ్యత తప్పనిసరిగా పరిశీలించాలి” అని అధికారులు సూచించారు...నగరానికి ఇష్టమైన చాయ్ కప్పులో ఇప్పుడు కల్తీ నీడ పడిన నేపథ్యంలో… వినియోగదారుల జాగ్రత్తే రక్షణ అని పోలీసులు చెబుతున్నారు.


.webp)
.webp)


