నకిలీ మద్యం కేసులో మరో నిందితుడికి బెయిల్

posted on: Feb 17, 2026 8:36PM

 

నకిలీ మద్యం కేసులో నిందితుడు సుదర్శన్‌కు బెయిల్ మంజూరైంది. ఇబ్రహీంపట్నం, ములకలచెరువుల్లో నకిలీ మద్యం తయారు చేసినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. సుదర్శన్ నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వాద, ప్రతివాదనలు ముగియడంతో విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు సమర్పించాలని ఆయనకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, నకిలీ మద్యం కేసులో మరో నిందితుడు సెంథిల్‌ను కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టుని కోరారు. తనకు బెయిల్ ఇవ్వాలని సెంథిల్ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఇరువురు పిటిషన్లపై‌ విచారణను కోర్టు ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...