భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత
posted on Nov 13, 2025 2:28PM

హైదరాబాద్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. మొహదీపట్నం పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్త ఆపరేషన్ లో భారీగా నకిలీ కరెన్సీ నోట్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు ద్విచక్రవాహనాలతో పాటు ఓ కారును, తొమ్మది మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరితో కలిసి తాండూరులో స్కానర్, ల్యాప్ టాప్, ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ సాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ నోట్లను అసలు నోట్లతో ఒకటి ఈజ్ టు నాలుగు నిష్పత్తిలో చెలామణి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
రమేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కస్టమర్లను సంప్రదించి నకిలీ నోట్లను విక్రయించేవాడు. అతని ద్వారా వహీద్, తహా, సోహైల్, ఫహాద్, ఇమ్రాన్, ఒమర్, అల్తమాష్ తదితరులు చైన్ సిస్టమ్‌లో నకిలీ నోట్లను విస్తరించారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు వారిపై నిఘా పెట్టి...ఈద్గా గ్రౌండ్స్, ఫస్ట్ లాన్సర్ వద్ద దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి , రిమాండ్ కి తరలించారు.