దాల్మియా సిమ్మెంట్స్ సెకండ్ ప్లాంట్ విస్తరణ పనులకు లోకేష్ శంకుస్థాపన.!

posted on: Jul 15, 2026 2:33PM

కడప జిల్లా   చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్  ఫ్యాక్టరీ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు  మంత్రి నారా లోకేష్ బుధవారం (జులై 14) శంకుస్థాపన చేశారు.

ముందుగా ప్లాంట్ ఆవరణకు చేరుకున్న మంత్రి లోకేష్ కు దాల్మియా భారత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియా, కంపెనీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.   దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు. కార్మికులను పలకరించి వారితో   సెల్ఫీ దిగిన లోకేష్ ఆ తరువాత పునీత్ దాల్మియాతో కలిసి దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్-2 విస్తరణ పనులకు మంత్రి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.  

దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్ 2 విస్తరణను  3 వేల100 కోట్ల వ్యయంతో చేపట్టనుంది.  ప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్లాంట్ విస్తరణతో కొత్తగా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

 Lokesh, Lay Foundation, Stone, Rs301 crores

google-ad-img
    Related Sigment News
    • Loading...