రూ.5 కోట్ల విలువైన గంజాయి దగ్ధం చేసిన ఎక్సైజ్ పోలీసులు

posted on: Feb 10, 2026 11:38AM

రూ.5 కోట్ల విలువైన 953 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న దాదాపు 953 కిలోల  గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు.   ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట   సమీపంలో ఉన్న ఒక బయో వేస్టేజ్ కంపెనీ ఆవరణలో  దగ్ధం చేసిన ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్ లో ఐదు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.  

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ గంజాయిని సోమవారం (ఫిబ్రవరి 9) బహిరంగంగా కాల్చివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,  జిల్లాలో గంజాయి సాగు చేసినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...