Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ...సీఎం రేవంత్ విచారం
posted on: Feb 1, 2026 10:10AM
.webp)
గంజాయి మాఫియా దాడిలో తీవ్రంగా గాయ పడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. గత వారం రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, చికిత్స ఫలించక చివరకు కన్ను మూశారు. గత వారం రోజుల క్రితం గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి మాఫియా సభ్యులు సౌమ్యపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే సహచరులు నిమ్స్ ఆసుపత్రికి తరలిం చారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమంగానే కొనసాగింది.
నిమ్స్ హాస్పిటల్ లో ఏడు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సౌమ్య పరిస్థితి క్షీణించడంతో ఈరోజు రాత్రి 11:15 గంటలకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య మృతి ఎక్సైజ్ శాఖతో పాటు పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సౌమ్య మృతిపై ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయాన్ని అందిస్తామని, విధి నిర్వహణలో చూపిన ధైర్యాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అధికారులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్లా సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.






