Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గినా… ఖజానాకు కాసుల వర్షం!
posted on: Apr 27, 2026 3:26PM

తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది. ఆస్తుల కొనుగోళ్లు కొద్దిగా తగ్గినా, ప్రభుత్వ ఆదాయం మాత్రం ఊహించని రీతిలో పెరగడం ప్రత్యేకంగా నిలిచింది. సంఖ్యలు తగ్గినా సొమ్ము పెరగడం ఇప్పుడు ఈ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఆస్తుల రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే సుమారు 50 వేల మేర తగ్గాయి. గత ఏడాది ఇదే కాలానికి 13 లక్షల డాక్యుమెంట్లు నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 12.50 లక్షలకు పరిమితమైంది.
అయితే ఇదే సమయంలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే ఆదాయం మాత్రం రూ.600 కోట్లకు పైగా పెరగడం గమనార్హం. ఈ విభిన్న పరిస్థితికి ప్రధాన కారణం 2026 ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన భూముల కొత్త మార్కెట్ విలువలు. విలువలు పెరగడంతో ఒక్కో రిజిస్ట్రేషన్‌పై వసూలయ్యే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా లావాదేవీలు తగ్గినా ప్రభుత్వ ఆదాయం మాత్రం పెరిగింది. ఈ ఊపుతో ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.19,100 కోట్ల ఆదాయ లక్ష్యం కూడా చేరువలోకి వచ్చింది.
ఇంకో కీలక మార్పు కొనుగోలుదారుల ప్రవర్తనలో కనిపిస్తోంది. గృహ రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించే వారు ఇప్పుడు ఆస్తుల నిజమైన మార్కెట్ విలువనే రిజిస్ట్రేషన్‌లో చూపిస్తున్నారు. గతంలో కనీస ప్రభుత్వ ధరల వద్దే డాక్యుమెంట్లు నమోదు అయ్యేవి. కానీ ఇప్పుడు అధిక విలువలతో రిజిస్ట్రేషన్లు జరగడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోటికి పైబడిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు కూడా ఆదాయ వృద్ధికి బలంగా మారాయి. కోకాపేట్, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో అధిక విలువ గల ఆస్తుల డిమాండ్ పెరగడం ఈ ధోరణిని మరింత బలపరిచింది. లావాదేవీల సంఖ్య స్వల్పంగా తగ్గినా, అధిక విలువ గల ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరగడంతో ఆదాయం పెరిగింది.
సంఖ్యలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 2024 ఏప్రిల్–డిసెంబర్ మధ్య రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.10,600 కోట్ల ఆదాయం వచ్చగా, 2025–26 అదే కాలానికి అది రూ.11,300 కోట్లకు చేరింది. అంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా ఆదాయం 6.6 శాతం పెరిగింది. మొత్తానికి, డీల్‌లు తగ్గినా ప్రతి డీల్ విలువ పెరగడంతో తెలంగాణ ఖజానా నిండుతోంది. “తెలంగాణ రైజింగ్” పేరిట పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.



.webp)


