మద్యం మత్తులో వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులు : సీపీ సజ్జనార్

 

కర్నూలు బస్సు ప్రమాదం తీవ్ర సంచ లనం సృష్టించిన విషయం తెలిసిందే.... ఓ ద్విచక్ర వాహన దారుడు మద్యం మత్తులో చేసిన తప్పు... ఎంతో మంది ప్రాణా లను బలితీసుకుంది. ఎన్నో కుటుంబాల్లో చీకట్లో నింపింది. ఈ ఘట నపై పోలీసులు దర్యాప్తు కొనసా గించగా... కర్నూలు జిల్లాకు చెందిన శివశంకర్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి తెల్లవారు జామున 2:24 గంటల ప్రాంతంలో పెట్రోల్ కోసం ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లభించింది. 

అనంతరం శివ శంకర్ మద్యం మత్తులో బైక్ స్పీడ్ గా నడుపుతూ తన స్నేహితుడిని ఇంటి దగ్గర దింపేందుకు బయలుదేరాడు. అదే సమయంలో బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి అత్యంత వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. శివశంకర్ స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మీద పడి ఉన్న బైకును శివ శంకర్ మిత్రుడు తీసేందుకు ప్రయత్నిం చాడు. కానీ బైక్ మీద నుంచి వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్లడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగి నట్లుగా దర్యాప్తులో తేలింది. 

అయితే ఈ ఘటనపై స్పందిం చిన హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులు, మానవ బాంబులు అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు....ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవు తారు.. చెప్పండి!! అంటూ ప్రశ్నించారు.

వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!? అంటూ హైదరా బాద్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు...సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు,మానవ బాంబుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రతగా ఉండండి. 

వీరి కదలికలపై అనుమానం వచ్చిన వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండంటూ సిపి సూచించారు. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీద కు వచ్చి ఎంతో మందిని చంపే స్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగు తుందంటూ  హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu