స్నేహితుడు శివశంకర్‌పై ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు
posted on Oct 26, 2025 1:20PM

కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన బైకర్ శివశంకర్‌పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డు మీద పడిందని ఫిర్యాదులో ఎర్రిస్వామి తెలిపాడు. రోడ్డు మీద పడ్డ బైక్‌ను ఒక వాహనం ఢీకొట్టడంతో నడిరోడ్డు పైకి వచ్చిందని, దానిపై నుండి బస్సు వెళ్ళడంతో మంటలు చెలరేగాయని ఎర్రిస్వామి పేర్కొన్నారు.
శివశంకర్ డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా బైక్‌ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో వేమురి కావేరి బస్సు ట్రావెల్స్ లాక్కుళ్లింది అని తెలిపారు. దీంతో బస్సుల్లో మంటలు చేలరేగి ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి వివరించాడు