తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

posted on: Mar 6, 2026 7:35PM

 

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం లభించింది.వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ ప్రస్తుతం వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది.పార్టీ పట్ల చూపుతున్న నిబద్ధత, నిర్వహణా సామర్థ్యాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకంతో రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడంలో స్వర్ణ కీలక పాత్ర పోషిస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...