ఐపీఎల్‌లో ధోని మెరుపుల శకం ముసిసినట్లేనా?

posted on: May 21, 2026 10:03PM

ఐపీఎల్‌లో మహేందర్‌సింగ్ ధోని మెరుపులు ఇక అభిమానులు చూసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు ధోని దూరమయ్యాడు. సీఎస్కే చివరి లీగ్ మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్‌లో  జరిగింది. ఈ మ్యాచ్‌లో అయినా ధోనీ ఆడతాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారికి నిరాశ తప్ప లేదు. ధోనీ అహ్మదాబాద్‌కు కాకుండా రాంచీ వెళ్లాడు. ఎందుకు వెళ్లాడనేది తెలియదు కానీ, ఈ రోజు మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో లేకుండా పోయాడు. 

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టుకు ధోనీ ఐదుసార్లు టైటిల్స్ అందించాడు. వయసు పెరుగుతున్నా, గాయాలు పాలవుతున్నా ధోనీని ఆ జట్టు వదులుకోవడం లేదు. దీంతో గతేడాది చివర్లో బ్యాటింగ్ కు వచ్చి అభిమానులను అలరించాడు.

ఈ సీజన్‌లో కూడా అలాగే చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అతడు ఇప్పటివరకు సీఎస్కే తరఫున బరిలోకి దిగలేదు. ఫిట్‌నెస్ సమస్యలతోనే అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ప్రస్తుతం సీఎస్కే 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది .

గుజరాత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే సీఎస్కే ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. పంజాబ్, కేకేఆర్, ఆర్ఆర్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోతే సీఎస్కేకు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం వస్తుంది. ఒకవేళ అద్భుతం జరిగి చెన్నై జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరితే ధోనీ ఆడతాడని వార్తలు వస్తున్నాయి. మరి, ధోనీని మరోసారి మైదానంలో చూడాలనుకునే అభిమానుల ఆశలు నెరవేరుతాయో లేదో చూద్దాం.

google-ad-img
    Related Sigment News
    • Loading...