Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎవరికీ పట్టని ఇంజనీరింగ్ కుంభకోణం!
posted on: Jul 2, 2026 3:00PM
.webp)
మధ్యతరగతి ఆశలపై నీళ్లు చల్లుతున్న నేటి విద్యా విధానం
ఇండియాలో మధ్యతరగతి కుటుంబాల అతిపెద్ద ఆకాంక్ష తన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా చూడటం. ముఖ్యంగా, దశాబ్దాలుగా ఇంజనీరింగ్ అనేది ఒక సురక్షితమైన భవిష్యత్తుకు, ఆర్థిక స్థిరత్వానికి రాజమార్గంగా భావించబడింది. అయితే.. ప్రస్తుత 2026 కాలమాన పరిస్థితులను పరిశీలిస్తే, ఈ సామూహిక విద్యా విధానం ఒక పెద్ద ఆర్థిక ఉచ్చుగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షలాది రూపాయలు వెచ్చించి సాధిస్తున్న ఈ డిగ్రీలు మార్కెట్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఒకప్పుడు బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి నగరాలను గ్లోబల్ టెక్ హబ్‌లుగా మార్చిన ఈ విద్యా సూత్రం, నేడు నిర్మాణాత్మక లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. తల్లిదండ్రులు తమ జీవితకాల పొదుపును, ఆస్తులను పణంగా పెట్టి చదివిస్తున్న చదువులు, చివరకు నిరుద్యోగాన్ని మిగులుస్తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సిన అవసరం ఏర్పడింది.
విఫలమైన ఉద్యోగ సూత్రం.. గణాంకాలు చెపుతున్న చేదు నిజాలు
గతంలో కష్టపడి చదివి, ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదిస్తే క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా జీవితం స్థిరపడుతుందనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుత విపణి వీధిలో ఈ నమ్మకం పూర్తిగా వమ్ము అవుతోంది. భారతదేశంలో ఏటా సుమారు 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు విద్యాసంస్థల నుండి బయటకు వస్తున్నారు. ఇటీవలి నివేదికల ప్రకారం, 2024 నాటికి ఈ భారీ సంఖ్యలో కేవలం పది శాతం మందికి మాత్రమే సరైన ఉపాధి లభించింది. ప్రభుత్వ అధికారిక ఆర్థిక సర్వే (2024–25) ప్రకారం.. దేశంలోని మొత్తం పట్టభద్రులలో కేవలం 51.25 శాతం మంది మాత్రమే పరిశ్రమలకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను కలిగి ఉన్నారు. ఇంజనీరింగ్ రంగంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 వెల్లడించిన వివరాల ప్రకారం.. దాదాపు 83 శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన తర్వాత కూడా చేతిలో ఎలాంటి ఉద్యోగం లేదా ఇంటర్న్‌షిప్ ఆఫర్ లేకుండా ఖాళీగా మిగిలిపోతున్నారు. దేశంలోని ప్రముఖ ఐటీ దిగ్గజాలు తమ నియామకాలను భారీగా తగ్గించుకున్నాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఈ పెద్ద కంపెనీలు అన్నీ కలిసి కేవలం 70,000 నుండి 80,000 మంది ఫ్రెషర్లను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి, ఇది గత ఇరవై ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయి.
కళాశాలల మితిమీరిన విస్తరణ
నాణ్యత లేని విద్యా వ్యాపారం1991 ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల తర్వాత దేశంలో సాంకేతిక విద్యా రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. విదేశీ పెట్టుబడుల రాకతో సాఫ్ట్‌వేర్, మాన్యుఫాక్చరింగ్ రంగాలు ఊపందుకున్నాయి. పాశ్చాత్య దేశాల కంటే తక్కువ వ్యయంతో ఇంగ్లీష్ మాట్లాడే సాంకేతిక నిపుణులు లభించడంతో ఇండియన్ ఐటీ రంగానికి స్వర్ణయుగం ప్రారంభమైంది. దీనిని చూసిన విద్యా ట్రస్టులు, ప్రైవేట్ వ్యాపారవేత్తలు ఇంజనీరింగ్‌ను ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చేశారు. 1990వ దశకంలో దేశవ్యాప్తంగా కేవలం 300 ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ఉండగా.. నేడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏకంగా 11 వేలకు పైగా సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. ఈ కళాశాలల్లో ఎక్కువ భాగం ఎలాంటి కనీస మౌలిక వసతులు, మార్కెట్ పరిజ్ఞానం లేకుండా, రహదారుల పక్కన వెలిసిన నిస్సారమైన సంస్థలుగా మారాయనే విమర్శలు ఉన్నాయి. దీని ఫలితంగా.. ప్రస్తుతం మన దేశంలో 22 నుండి 26 సంవత్సరాల వయస్సు గల ప్రతి నలుగురు యువకులలో ఒకరు ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఈ అధిక సరఫరా.. ప్రస్తుత నిరుద్యోగ సంక్షోభానికి మూలకారణంగా మారింది.
సంపదను హరించే ఆర్థిక ఉచ్చు
పెట్టుబడికి తగ్గని రాబడి సాధారణంగా ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి 12 లక్షల నుండి 18 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతోంది. ఈ భారీ మొత్తాన్ని భరించడానికి మధ్యతరగతి కుటుంబాలు విద్యా రుణాలు, బంగారు నగలను తాకట్టు పెట్టడం, అధిక వడ్డీలకు అప్పులు చేయడం వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే, ఇంతటి ఆర్థిక భారాన్ని మోసి బయటకు వచ్చే విద్యార్థులకు లభిస్తున్న ప్రారంభ వేతనాలు నెలకు కేవలం 20 వేల నుండి 30వేల రూపాయలలోపే ఉంటున్నాయి. ఇంజనీరింగ్ విద్య మొత్తం ఖర్చు 500శాతం పెరుగుదల కాగగా, ప్రారంభ స్థాయి ఉద్యోగాల వేతనాలు 50% పెరుగుదల మాత్రమేనని పరిశీనలలు తేల్చాయి. ఈ వ్యత్యాసం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే కుటుంబ సంపదను పెంపొందించడానికి బదులుగా పూర్తిగా హరించి వేస్తోంది. ఉదాహరణకు, నెలకు పాతిక వేల రూపాయలు సంపాదించే యువకుడు ఏడాదికి మూడు లక్షలు ఆర్జిస్తే.. అతను చదువు కోసం 12 శాతం వడ్డీతో తీసుకున్న 15 లక్షల రూపాయల రుణానికి గాను సంవత్సరానికి 1.88 లక్షల రూపాయలు కేవలం వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. నగరాల్లో నివాసం, తిండి, ప్రయాణ ఖర్చులు పోను అసలు మొత్తాన్ని చెల్లించడం ఆ విద్యార్థికి అసాధ్యంగా మారుతోంది. అయినప్పటికీ.. మార్కెటింగ్ మాయాజాలంతో విద్యాసంస్థలు ఇంకా పాత కల్పనలనే అమ్ముకుంటూ లాభపడుతున్నాయి.
పాతబడిన పాఠ్యప్రణాళిక
మారుతున్న సాంకేతికతకు అందని విద్యా విధానం భారతదేశంలో డిగ్రీల విలువ పడిపోవడానికి ప్రధాన కారణం. ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ సి.ఎన్.ఆర్. రావు ఒక సందర్భంలో పేర్కొన్నట్లు.. దేశంలోని దాదాపు 90 శాతం విశ్వవిద్యాలయాల సిలబస్ ప్రస్తుత కాలానికి ఏమాత్రం సరిపోని విధంగా పాతబడిపోయింది. అంటే కాలం చెల్లింది. యుజీసీ , ఏఐసీటీఈ వంటి నియంత్రణ సంస్థల పరిధిలో ఒక సిలబస్‌ను సవరించడానికి సంవత్సరాల సమయం పడుతుంది. ఆ కమిటీల ఆమోదాలు వచ్చేలోపే సాంకేతిక రంగం మరిన్ని తరాలు ముందుకు వెళ్ళిపోతోంది. ప్రస్తుతం విద్యాసంస్థల్లో బోధించే విషయాలు పరిశ్రమల నిజమైన అవసరాల కంటే ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు వెనుకబడి ఉన్నాయి. విద్యార్థులు మార్కులు సాధించడం కోసం పాత కోడింగ్ విధానాలను బట్టీ పడుతుంటే, అంతర్జాతీయ టెక్ మార్కెట్ మాత్రం డీప్ లెర్నింగ్, జనరేటివ్ఏఐ, ఫిజికల్ ఏఐ, రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల వైపు దూసుకుపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ దెబ్బ, ప్రస్తుత ప్రపంచవ్యాప్త ధోరణులను గమనిస్తే టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత తీవ్రంగా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో ఒకే సంవత్సరంలో లక్షకు పైగా సాంకేతిక ఉద్యోగాలు శాశ్వతంగా తొలగించబడ్డాయి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన ఇంటెల్ 22 వూల మందిని, అమెజాన్ 14 వేల మందిని, మైక్రోసాఫ్ట్ 15 వేల మందిని, దేశీయ దిగ్గజం టీసీఎస్ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇటువంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుకుంటున్నాయి. AI ఆధారిత అధునాతన డెవలప్‌మెంట్ ఏజెంట్ల వాడకం పెరగడంతో, గతంలో పలువురు జూనియర్ డెవలపర్లు, మాన్యువల్ టెస్టర్లు, డేటాబేస్ విశ్లేషకులు చేసే పనులను ఇప్పుడు ఒకే ఒక్క ఇంజనీర్ ఏఐ సహాయంతో పూర్తి చేయగలుగుతున్నాడు. తక్కువ ఖర్చుతో కూడిన జూనియర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను సరఫరా చేయడంలో భారతదేశానికి ఉన్న చారిత్రక సానుకూలతను ఈ సాంకేతిక విప్లవం దెబ్బతీసింది.
వ్యవస్థాగత లోపాలు , ప్రత్యామ్నాయ అవసరం
గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారనే అంశాన్ని మన విద్యా వ్యవస్థ సాధించిన విజయంగా చెప్పుకోలేము. ఎందుకంటే, ఆ ప్రతిభావంతులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది కానీ, మన దేశీయ విద్యాసంస్థలు అటువంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లను ఇక్కడ సృష్టించలేకపోయాయి.దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్ పిలానీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కేవలం 18 వేల సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. 2026 నాటి జేఈఈ మెయిన్స్ పరీక్షకు ఏకంగా 14.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడ్డారు. అంటే 99 శాతం మంది విద్యార్థులకు సాధారణ ప్రైవేట్ కళాశాలలే దిక్కవుతున్నాయి. ఈ నేపథ్యంలో, దాదాపు 73 శాతం మంది రిక్రూటర్లు ఇప్పుడు కాలేజీ డిగ్రీ సర్టిఫికేట్ల కంటే అభ్యర్థికి ఉన్న నిజమైన నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
పరిష్కార మార్గంగా నిలుస్తున్న ఎన్‌ఐఏటీ నమూనా
సాంకేతిక విద్యా రంగంలో నెలకొన్న ఈ నిస్సహాయ స్థితిని మార్చడానికి "నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ (ఎన్‌ఐఏటీ ) ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థను ముందుకు తెచ్చింది. టెక్ రంగంలో అనుభవజ్ఞులైన ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థులు వందకు పైగా క్యాంపస్‌లను పరిశీలించిన తర్వాత ఈ నమూనాను రూపొందించారు. పరిశ్రమలకు అవసరమైన ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్‌లను నిర్మించే సామర్థ్యం విద్యార్థుల్లో లోపించిందని గుర్తించి.. దానికి అనుగుణంగా ఐదు ప్రధాన స్తంభాలపై దీనిని నిర్మించారు
నిరంతరం నవీకరించబడే సిలబస్
200 మందికి పైగా ఆర్ అండ్ డి నిపుణుల బృందం ప్రతి ఆరు నెలలకొకసారి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను సవరిస్తుంది. క్లాస్‌రూమ్‌లు లైవ్ కోడింగ్ ల్యాబ్‌లుగా మారి, విద్యార్థులు నిజమైన అప్లికేషన్‌లపై పని చేస్తారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఎంటర్‌ప్రైజ్ స్థాయి AI టోకెన్ల యాక్సెస్‌తో పాటు, 200 పైగా పారామీటర్లను విశ్లేషించే ఏఐ క్లాస్‌రూమ్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది.చదువుకుంటూ సంపాదన. మూడవ సంవత్సరం నుండే విద్యార్థులు చేసే ప్రతి లైవ్ ప్రాజెక్ట్‌కు 30 వేల రూపాయల గ్యారెంటీ స్టైఫండ్ లభిస్తుంది.
ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్
ఐఐటీ ఖరగ్‌పూర్‌తో భాగస్వామ్యం ద్వారా జేఈఈ వంటి కఠిన పరీక్షల అవసరం లేకుండానే జనరేటివ్ AI పునాదులలో OCN మైక్రో స్పెషలైజేషన్ సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం ఈ నైపుణ్య ఆధారిత నమూనా ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులను 3,500 కంటే ఎక్కువ కంపెనీలు విజయవంతంగా నియమించుకున్నాయి. ప్రతి నెలా వందకు పైగా కొత్త కంపెనీలు ఈ ప్లాట్‌ఫారమ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. విద్యార్థులు ఇకపై ఉనికిలో లేని పాత ప్రపంచం కోసం నాలుగు సంవత్సరాలు వృథా చేస్తారా లేదా ఇప్పటికే ఆవిర్భవిస్తున్న సరికొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించడానికి సిద్ధమవుతారా అనేది వారి ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






