కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోలు హతం
posted on: Feb 19, 2026 11:46AM
.webp)
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టలు తుపాకి మోతలతో దద్దరిల్లాయి. గురువారం (ఫిబ్రవరి 19) కర్రెగుట్టల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇదురుగు నక్సలైట్లు హతమయ్యారు. అయితే హతమైన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
నక్సల్స్ రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ కగార్-2లో భాగంగా చేపట్టిన కూంబింగ్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కర్రెగుట్టల్లో పెద్ద సంఖ్యలో మావోలు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం తెల్లవారు జామున ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు తదితరులు ఉన్నారని భద్రతా బలగాలు చెబుతున్నాయి.
సమాచారంతో బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. తెల్లవారుజామున బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. అడవి లోపల ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. కర్రెగుట్టల్లో ఇంకా మావోయిస్టులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఇలా ఉండగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.



.webp)


