Latest News

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్.. పది మంది మావోలు హతం

posted on: Jan 22, 2026 12:00PM

జార్ఖండ్ లో గురువారం (జనవరి 22) జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. సిగ్భూం జిల్లాలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కీలక నేతల మరణించినట్లు తెలుస్తోంది.

ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యలలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్ జరిగింది.   ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా దిగ్బంధించాయి. జార్ఖండ్‌లో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా నిర్మూ లించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్ కీలక దశకు చేరిందని అధికారులు అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...