ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులో ఎన్‌కౌంటర్

posted on: Jan 29, 2026 1:49PM

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన ఎదురు కాల్పులు సాయంత్రం వరకూ కొనసాగాయి.  అపరేషన్ కగార్ లో భాగంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్ కౌంటర్ జరిగింది.  

ఈ ఎన్ కౌంటర్ లో ఎందరు మృతి చెందారన్న సమాచారం వెంటనే తెలియరాలేదు. ఇప్పటి వ వరకూ సంఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరి కొందరు మావోయిస్టులు కూడా ఈ ఎన్ కౌంటర్ లో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు.  అలాగే ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న అంచనాతో అదనపు బలగాలను తరలించారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...