హమ్మయ్య జగన్ గుడ్ లుక్స్ లోకి అంబటి.. సామాజిక సమీకరణాలూ కలిసొచ్చాయిగా?

posted on: Feb 6, 2026 10:17AM

ఇంత కాలానికి అంబటి రాంబాబు జగన్ గుడ్ లుక్స్ లోకి వచ్చేశారు. అవును ఇప్పుడు వైసీపీలో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ కు ఎంతో ఇష్టమైన బూతుపురాణాన్నివినిపించిన అంబటికి ఇక ఇప్పుడు పార్టీలో పదోన్నతి, కీలక స్థానం ఖాయమన్న భావన పార్టీలో వినిపిస్తోంది. పైగా వైసీపీ ఎకో సిస్టమ్ లో జగన్ దృష్టిలో పడాలన్నా, ఆయన మెప్పు పొందాలన్న ప్రత్యర్థి పార్టీల నాయకులపై బూతులతో విరుచుకుపడాలి. లేదా వారి ఇళ్లపై దాడులకు పాల్పడాలీ, అదీ కాకపోతే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలను దగ్ధం చేయాలి.

వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు. ఇక అంబటి రాంబాబు, పేర్ని నాని కూడా జగన్  అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఆయన మెప్పు కోసం సొంత సామాజికవర్గాన్ని కూడా కించపరుస్తూ జనసేనాని పవన్ పై దూషణలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే వారిరువురికీ జగన్ కేబినెట్ లో స్థానం దక్కింది.  ఇక నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  జగన్ వైసీపీ లో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చేసి హద్దులు మీరి బూతులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన వారందరికీ అందలాలు దక్కాయి. పదవుల తాయిలాలు అందాయి.

అధికారం కోల్పోయిన తరువాత  అప్పట్లో హద్దులు మీరి చెలరేగిన వారిలో చాలా మంది జాగ్రత్తపడో, భయపడే నోటికి తాళాలు వేసేసుకున్నారు. కానీ అప్పటి కంటే ఎక్కువగా చెలరేగిపోతున్న అంబటి రాంబాబు  ఇప్పుడు జగన్ మెప్పు పొదారనీ వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆయనకు పార్టీలో కీలక స్థానం ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే తన బూతులతో అంబటి రాంబాబు జనం దృష్టిలో మరింత దిగజారిపోయారని పరిశీలకులు అంటున్నారు.

అయితే జగన్  మెప్పు ముందు ప్రజల దృష్టిలో దిగజారడం ఏమంత విషయం కాదని వైసీపీయులు అంటున్నారు. ఇప్పుడు పార్టీలో చర్చ అంతా అంబటికి పార్టీలో దక్కే కీలక స్థానం ఏమిటన్నదే అని అంటున్నారు. అన్నిటికీ మించి తెలుగుదేశం కూటమిలో చీలకలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన అంబటికి పార్టీలో కీలక పదవి ఇవ్వడం కలిసొచ్చే అంశంగా మారుతున్నంద ఆశా ఉందని అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...