ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు మరోసారి ఈడీ సమన్లు

posted on: May 22, 2026 9:14AM

 

భూదాన్ భూముల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించిన ఈడీ.. మూడు సేల్ డీడ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని సూచించింది.

భూదాన్ భూముల వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.. గతంలో నమోదైన కేసులను ఆధారంగా తీసుకుని విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే 2024లో అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా లభించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా మళ్లీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. సుమారు 42 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు, వాటి ద్వారా అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...