Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశంలో తొలిసారిగా ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ
posted on: Jul 3, 2026 5:34PM
.webp)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న Hawker 800A చార్టర్ విమానాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించింది. దేశంలోనే తొలిసారిగా మనీలాండరింగ్ కేసులో సీజ్ చేసిన విమానాన్ని ఈ-ఆక్షన్ ద్వారా విక్రయిం చడం విశేషంగా నిలిచింది. ఫాల్కన్ పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందిన ఈ Hawker 800A విమానాన్ని హైదరాబాద్ జోనల్ ఈడీ 2025 మార్చి 7న శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకుంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ విమానాన్ని జప్తు చేసిన అధికారులు, తదుపరి అడ్జుడికేటింగ్ అథారిటీ అనుమతి పొందిన అనంతరం విక్రయ ప్రక్రియను ప్రారంభించారు. జూలై 1న ప్రభుత్వ రంగ సంస్థ MSTC ఆధ్వర్యంలో ఈ-ఆక్షన్ నిర్వహించగా, Hawker 800A విమానం రూ.3 కోట్లకు విక్రయించబడింది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ-వేలం ద్వారా వచ్చిన మొత్తం మొత్తాన్ని కేసులో మోసపోయిన పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించేందుకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఫాల్కన్ సంస్థ నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో పెట్టుబడిదారులను ఆకర్షించి భారీ ఎత్తున నిధులు సేకరించినట్లు ఈడీ గుర్తించింది.
అధిక లాభాల పేరుతో వేలాది మంది నుంచి డబ్బులు సేకరించి, సుమారు రూ.792 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమంగా సంపాదించిన నిధులతో విలాసవంతమైన ఆస్తులు, విమానాలు సహా పలు ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది. వారి నుంచి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకుని మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును మరింత విస్తరించింది.
మోసానికి సంబంధించిన ఇతర ఆస్తుల గుర్తింపు, నిధుల జాడ, సహకరించిన వ్యక్తులు మరియు సంస్థల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది.బాధితులకు వీలైనంత త్వరగా వారి సొమ్ము తిరిగి అందేలా స్వాధీనం చేసుకున్న ఆస్తులను చట్టబద్ధంగా విక్రయించి పరిహారం చెల్లించే ప్రక్రియను కొనసాగిస్తు న్నామని ఈడీ పేర్కొంది. ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో విమానం ఈ-వేలం దేశంలోనే తొలిసారిగా జరగడం చట్ట అమలు సంస్థల చర్యల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.






