తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు

posted on: May 27, 2026 4:20PM

 

తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించడంతో స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది... కరీంనగర్‌, హైదరాబాద్‌ కేంద్రంగా  ఇసుక, గ్రానైట్ వ్యాపారులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. సమాచారం ప్రకారం మొత్తం 8 ప్రాంతాల్లో నాలుగు కంపెనీలకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. 

కేంద్ర భద్రతా బలగాల సాయంతో రికార్డులు, లావాదేవీల పత్రాలు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు వివరా లను అధికారులు పరిశీలిస్తు న్నారు. గ్రానైట్‌, ఇసుక వ్యాపారాల్లో భారీ స్థాయిలో GST ఎగవేత జరిగినట్లు ఈడి అధికారులు గుర్తించారు. నకిలీ బిల్లులు సృష్టించడం, షెల్ కంపెనీల ద్వారా కోట్ల రూపాయలను ఇతర ఖాతాలకు మళ్లించడం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ ప్రారంభించారు.ఇటీవల రాష్ట్రంలో పన్ను ఎగవేత, అక్రమ ఆర్థిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ముఖ్యంగా గ్రానైట్‌ వ్యాపారాల్లో నకిలీ GST నంబర్లు ఉపయోగించి భారీగా పన్ను ఎగవేత జరుగుతున్నట్లు కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఈ సోదాలకు సంబంధిం చిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...