తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు.. రంగంలోకి ఈడీ

posted on: Jan 31, 2026 9:33AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వనియోగం కేసు దర్యాప్తులో ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ కేసులో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని సిట్ దర్యాప్తులో నిర్థారణ కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో  సిట్ చార్జిషీటు ఆధారంగా  ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతోంది

. సిట్ దర్యాప్తులో వందల కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు తేలడంతో ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి సారిస్తోంది.  ప్రధానంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అవకతవకలు,  భారీ కమిషన్లు సెంట్రక్ గా ఈడీ దర్యాప్తు సాగనుంది.  

ఈ కుంభకోణంలో  సొమ్మును ఎక్కడికి తరలించారు? హవాలా రూపంలో విదేశాలకు పంపారా? లేదా ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారా? అన్న కోణంలో  ఈడీ దర్యాప్తు సాగనుంది. ఈ దర్యాప్తునకు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న  ఒక లింక్ గా భావిస్తున్న ఈడీ, అంతిమ లబ్థిదారు ఎవరన్న దిశగా దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.    

google-ad-img
    Related Sigment News
    • Loading...