Latest News

స్కిల్ కేసు.. చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్

posted on: Feb 2, 2026 8:46AM

స్కిల్ కేసులో చంద్రబాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఏపీ రాజకీయాలలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  కుంభకోణం కేసులో  మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈడీ తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ లో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది.  నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎటువంటి ఆధారాలూ లేవని విస్పష్టంగా పేర్కొంది.

విశాఖలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ  దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ చార్జిషీన్ ను కోర్టు గత నెల 28న విచారణకు స్వీకరించింది.  ఈ కేసులో డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను, ఆ సంస్థ ఎండీ  వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్  తదితరులను నిందితులుగా పేర్కొన్న ఈడీ, చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. 

ఇదే స్కిల్ కేసులో గత జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపణలను మిస్టేక్ ఫ్యాక్ట్ గా పేర్కొంటూ ఏపీ సీఐడీ  గత నెలలోనే విజయవాడ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఐడీ క్లోజర్ రిపోర్టును కోర్టు ఆమోదించి కేసు ముగించిన సంగతీ విదితమే.   సీఐడీ  ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు చేపట్టిన ఈడీ కూడా ఇప్పుడు చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల తెలుగుదేశం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ను  ఆయన  గొప్ప నైతిక విజయంగా మంత్రి అచ్చన్నాయుడు అభివర్ణించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...