సరోగసి, శిశు అక్రమ రవాణా కేసు.. డాక్టర్ నమ్రతను అరెస్టు చేసిన ఈడీ

posted on: Feb 13, 2026 8:37AM

సరోగసీ, శిశు అక్రమ రవాణ ఆరోపణలతో నమోదైన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ నమ్రతను  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  (ఈడీ)  గురువారం (ఫిబ్రవరి 12)న అరెస్టు చేసింది.   యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధిపతిగా వ్యవహరిస్తున్న నమ్రతపై భారీ ఆర్థిక లావాదేవీలు, నకిలీ వైద్య పత్రాల సృష్టి వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు దర్యాప్తు అధికా రులు వెల్లడించారు. గత రెండు రోజులుగా  బషీర్‌ బాగ్‌లోని ఈడీ కార్యాల యంలో ఆమెను విచారించిన ఈడీ విచారణ అనంతరం గురువారం (ఫిబ్రవకి 12)  అరెస్ట్ చేసి నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు ఫిబ్రవరి 26 వరకు రిమాండ్ విధించింది.   దర్యాప్తునకు   డాక్టర్ నమ్రత సహకరించడం లేదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. 

 ఐవీఎఫ్, సరోగసీ సేవల పేరుతో సంతానలేమితో బాధపడుతున్న దంపతుల నుంచి30 లక్షల నుంచి 40 లక్షలరూపాయల వరకూ వసూలు చేయడమే కాకుండా,  చట్టబద్ధ వైద్య ప్రక్రియలు పాటించకుండా, బలహీన వర్గాలకు చెందిన మహిళల నుంచి శిశువులను సమకూర్చి, వాటిని సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలుగా చూపించి నట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం నకిలీ మెడికల్ రికార్డులు, కృత్రిమ డీఎన్‌ఏ నివేదికలు సృష్టించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. 

రాజస్థాన్‌కు చెందిన  దంపతులు స్వతంత్రంగా డీఎన్‌ఏ పరీక్ష చేయించగా, తమకు అప్పగించిన శిశువుకు జీవ సంబంధం లేదని తేలడంతో ఈ వ్యవహారం కాస్త బహిర్గత మైంది. అనంతరం మరి కొన్ని కుటుంబాలు కూడా ముందుకు రావడంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. 

ఈ కేసులో డాక్టర్ నమ్రతను 2025 జూలైలో గోపాలపురం పోలీసులు తొలిసారి  అరెస్ట్ చేశారు. క్లినిక్ కార్య కలాపాలకు సంబంధించి ఏజెంట్లు, టెక్నీషియన్లు సహా ఎనిమిది మందిపై   కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా 2025 అక్టోబర్‌లో ఈడీ, పీఎంఎల్‌ఏ  కింద కేసు నమోదు చేసింది. ఇప్పటివరకు డాక్టర్ నమ్రత కుమారుడు పి. జయంత్ కృష్ణ సహా 24 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...