Latest News
పశ్చిమ బెంగాల్ లో సంచలనం.. ఒకే సారి 72 మంది ఆర్వోలపై ఎన్నికల సంఘం వేటు
posted on: Mar 24, 2026 4:21PM
.webp)
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 73 మంది రిటర్నింగ్ అధికారులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వచ్చేనెల 23, 29 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒకే సారి భారీగా ఆర్వోల తొలగింపు నిర్ణయం సంచలనం సృష్టించింది.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్నికల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈ తొలగింపు జరిగిందని తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఈ అధికారులను ఎందుకు తొలగించిందనే దానిపై స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. బీజేపీ వంటి పార్టీలు అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నందునే 72 మంది ఆర్వోలపై ఎన్నికల సంఘం వేటు వేసిందని అంటున్నారు.


.webp)



