Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగ్గారెడ్డిపై ఈసీ ఆగ్రహం...తప్పుపట్టిన మాజీ ఎమ్మెల్యే
posted on: Feb 11, 2026 8:26PM

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తనపై కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించి నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారని, వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయ త్నించడంతో ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయని తెలిపారు.
మీడియాతో మాట్లాడుతూ... జగ్గారెడ్డి పలు ఆరోపణలు చేశారు. “బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి వార్డులో కనీసం 300 వరకు దొంగ ఓట్లు నమోదు చేశారు. స్థానికంగా నివసించని వ్యక్తుల పేర్లను జాబితాల్లో చేర్చారు. ఈ వ్యవహారంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు,” అని అన్నారు. దొంగ ఓట్లను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.ఒక ఘటనను ప్రస్తావిస్తూ, “దొంగ ఓట్లు వేయకుండా మా కార్యకర్తలు అడ్డుకున్న ప్పుడు సీఐ ఒక కార్యకర్త కాలర్ పట్టుకుని తోసివేశాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే నా ఉద్దేశ్యం,” అని వివరించారు.
దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. “దొంగ ఓట్లు నమోదు అయ్యాయంటే వాటిని తొలగించడం ఎన్నికల కమిషన్ బాధ్యత కాదా? ముందస్తుగా పరిశీలన చేయకుండా, ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకుండా ఉండటం అధికారుల వైఫల్యం కాదా?” అని విమర్శించారు. తనపై నమోదు చేసిన కేసు రాజకీయ ప్రేరణతోనేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. “దొంగ ఓట్లు అడ్డుకున్నందుకే నా మీద కేసులు పెట్టడం ఏంటి? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేసిన వారిపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనం,” అని అన్నారు.
ఈ కేసు నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ఓటరు జాబితాల పరిశీలన కచ్చితంగా జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, జగ్గారెడ్డి ఆరోపణలపై ఎన్నికల అధికారులు మరియు పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇక ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడిని రగిలించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎస్‌ఈసీ కేసు, దొంగ ఓట్ల ఆరోపణలు, అధికారుల పాత్రపై వచ్చే రోజుల్లో స్పష్టత రావాల్సి ఉంది.






