40 ఏళ్ల రికార్డు బద్దలు! ఆసియా ఫుట్‌బాల్‌లో భారత్ సరికొత్త చరిత్ర!

posted on: Aug 21, 2026 10:55AM

ఆసియా ఫుట్‌బాల్ వేదికపై భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మలేసియాలోని కోటా కినాబాలు వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌‌ 2026–27 ప్రిలిమినరీ స్టేజ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ చారిత్రాత్మక సంచలనం సృష్టించింది. గువామ్‌కు చెందిన రోవర్స్‌‌ ఎఫ్‌‌సీతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ మహిళల జట్టు ఏకంగా 12–0 గోల్స్ తేడాతో ప్రత్యర్థిని ఘోరంగా చిత్తు చేసింది. మైదానంలో ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడిన భారత క్రీడాకారిణులు ప్రత్యర్థికి కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషంలోనే ప్రియాంక దేవి అద్భుత గోల్‌తో ఖాతా తెరిచి జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత 15వ నిమిషంలో ఆస్తమ్‌‌ ఒరాన్‌‌, మళ్లీ 22వ నిమిషంలో ప్రియాంక గోల్ కొట్టడంతో ప్రథమార్ధంలోనే మ్యాచ్ ఈస్ట్ బెంగాల్ చేతుల్లోకి వచ్చింది. ఇక ద్వితీయార్థంలో ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. ఒలివియా అనోక్యే 48, 58వ నిమిషాల్లో రెండు గోల్స్‌తో మెరవగా, అబిగైల్‌‌ అంట్వికి 49వ నిమిషంలో, సులంజన 51వ నిమిషంలో, షిల్కీ 56వ నిమిషంలో వరసగా గోల్స్ సాధించారు. మ్యాచ్ ముగిసే సమయానికి అబెనా ఒపోకు 64, 70వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టగా, అంజు 73వ నిమిషంలో, ఇంజారీ టైమ్‌లో గుగులోత్‌‌ సౌమ్య 93+3వ నిమిషంలో గోల్ సాధించి రికార్డు విజయాన్ని ఖరారు చేశారు.

 

 

 

east bengal fc historic 12 0 victory rovers fc,afc womens champions league east bengal record.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...