Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హిమాచల్ లో కంపించిన భూమి
posted on: Jun 6, 2026 3:16PM
.webp)
హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. శుక్రవారం (జూన్ 5) రాత్రి సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం చంబా జిల్లాలో భూకంప కేంద్రం ఉంది. చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది. చంబా పరిధిలోని హోలీ ప్రాంతంలో కొన్ని ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయనీ, గోడలకు పగుళ్లు వచ్చాయనీ సమాచారం. ఇది వినా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.


.webp)



