విశాఖలో కంపించిన భూమి
posted on Nov 4, 2025 8:11AM
.webp)
విశాఖపట్నంలో మంగళవారం (నవబంర్ 4)తెల్లవారు జామున భూమి కంపించింది. జనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి స్వల్పంగా కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో నిద్ర నుంచి ఒక్కసారిగా మేల్కోన్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారు జామున 4.16 గంటల నుంచి 4.20 గంటల మధ్య భూమి కంపించింది.
గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. అయితే ఈ తీవ్రత ఎంతన్నది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. భూ కంప తీవ్రత స్వల్పంగానే ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూమి కంపించిన ప్రాంతాలలో ప్రజలు చాలా వరకూ తెల్లవారే వరకూ ఇళ్ల బయటనే గడిపారు. ఎటువంటి ఆస్త, ప్రాణ నష్టం సంభవించలేదు.