Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుత్బుల్లాపూర్ లో పెద్ద శబ్దంతో కంపించిన భూమి
posted on: Feb 10, 2026 1:16PM

హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ లో భూమి కంపించింది. మంగళవారం ఉదయం 11 గంటల పది నిముషాలకు భూమి కంపించడంతో పాటు పెద్ద శబ్దం కూడా రావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.
కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారంలో ఉన్న మెట్కాన్ గూడెం పరిసరాలలో సంభవించిన ఈ భూకంపంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఒక్కసారిగా ఇళ్ల నుంి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతంలోని గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్నవారు బయటకు పరుగులు తీశారు. ఈ భూకపంతో స్థానికంగా ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భూమి కంపించిందా? పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్ధం, ప్రకంపనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


.webp)



