జమ్మూ కాశ్మీర్ లో కంపించిన భూమి

posted on: Feb 2, 2026 10:00AM

జమ్మూ కశ్మీర్ లోయలో సోమవారం (ఫిబ్రవరి 2) తెల్లవారుజామున భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడం, అదీ కొన్ని సెకండ్ల పాటు కొనసాగడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  

కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భూకంప తీవ్రత ప్రభావం ఎక్కువగా కనిపించిందని చెబుతున్నారు.  రాజధాని శ్రీనగర్‌కు కేవలం 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.  కాగా ఈ భూకంపం కారణంగా  ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...