బడ్జెట్‌‌లో ఏ రంగానికి ఎంతంటే?

posted on: Feb 1, 2026 1:02PM

 

2026- 2027 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వార్షిక బడ్జెట్‌ మొత్తం రూ. 53.5 లక్షల కోట్లు.. బడ్జెట్‌లో రవాణా రంగానికి అత్యధికంగా రూ. 5,98,520 కోట్లు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి రూ. 2,73,108 కోట్లు, రక్షణ రంగానికి రూ. 5,04,585 కోట్లు కేటాయించారు. హోం వ్యవహారాలకు రూ. 2,55,734 కోట్లు, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు రూ. 1,62,671 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే విద్య శాఖకు రూ. 1,39,309 కోట్లు, సామాజిక సంక్షేమానికి రూ. 1,09,025 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ. 1,04,599 కోట్లు  వ్యవసాయం రూ. 1,62,671 కోట్లు విద్య రూ.1,39,289 కోట్లు వైద్యారోగ్యం రూ.1,04,599 కోట్లు కేటాయించారు. 

పట్టణాభివృద్ధికి రూ. 85,522 కోట్లు, ఐటీ మరియు టెలికాం రంగానికి రూ. 74,560 కోట్లు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖకు రూ. 70,206 కోట్లు కేటాయింపులు చేశారు. అలాగే శాస్త్రీయ విభాగాలకు రూ. 55,756 కోట్లు, పన్నుల పరిపాలనకు రూ. 45,500 కోట్లు, విదేశాంగ వ్యవహారాలకు రూ. 22,119 కోట్లు, ఆర్థిక శాఖకు రూ. 20,649 కోట్లు కేటాయించారు. ఉత్తర తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి రూ. 6,812 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. 

బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రారంభంలో బడ్జెట్ ప్రసంగం రుచించని ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత వివిధ అంశాలు కాస్త సానుకూలంగా ఉండటంతో నష్టాలు మధ్యాహ్నం 1 గంటల సమయానికి సగానికి పైగా తగ్గాయి. సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి.మధ్యాహ్నం 12.53 గంటలకు సెన్సెక్స్ 1,174 పాయింట్లు క్షీణించి 81,392 వద్ద, నిఫ్టీ 399 పాయింట్లు పడిపోయి 25,019 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 

మధ్యాహ్నం 1.00 గంటలకు సూచీలు కాస్త కోలుకుని సెన్సెక్స్ 1,053 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్ల క్షీణతతో కదలాడుతున్నాయి.ఈ బడ్జెట్‌ ద్వారా విదేశీ మద్యం, లగ్జరీ వాచ్‌ల రేటులు పెరిగే అవకాశం ఉంది. ధరలు తగ్గేవి క్యాన్సర్ ఔషధాలు, డయాబెటిక్ మందులు, ఈవీ బ్యాటరీలు, సోనాల్ ప్యానల్స్, విదేశీ యాత్రలపై పన్ను, మైక్రో అవెర్స్, విదేశీ విద్య, చెప్పులు, ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు వీటితో పాటు దేశీయంగా తయారయ్యే మొబైల్స్, ట్యాబ్లెట్ ధరలు కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. 

కొబ్బరి ఉత్పత్తి కోసం కొబ్బరి ప్రోత్సాహకం పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్లు ఏర్పాటుకు ప్రోత్సహం ఇస్తామన్నారు. కాయలుకాయని కొబ్బరి చెట్ల స్థానంలో కొత్త చేట్లు ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ పథకం ముఖ్యంగా ఏపీలోని రైతులకు ఉపశయం కలిస్తుందన్నారు. 500 రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలు... వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.  జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...