Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ ఈ3 కార్యక్రమం
posted on: Apr 12, 2026 7:04AM

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల కోసం ఈ-3 ప్రొగ్రాం అమలు చేయనున్నట్లు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు. తన కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచన చేశానో అలాగే టీడీపీ కుటుంబం కోసం ఆలోచన చేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
పార్టీ సీనియర్ నేతలతో నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం శిక్షణ ఇప్పిస్తోంది. మంగళ గిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో జరుగుతున్న శిక్షణా తరగతులకు చంద్రబాబు నాయుడుక్రమం తప్పకుండా హాజరవుతున్నారు. శనివారం ఏప్రిల్ 11) శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో సీఎం కాఫీ తాగుతూ తన అభిప్రాయాలు పంచుకున్నారు.


.webp)
.webp)


