Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళ రాజకీయాల్లో విలువల పతనం.. హీరోయిన్లపై రాజకీయ నేతల దిగజారుడు వ్యాఖ్యలు
posted on: Mar 18, 2026 4:34PM

తమిళనాడు రాజకీయాల్లో విలువల పతనం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతలు అంశాల వారీ విమర్శలు కాకుండా హీరోయిన్లపై అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలూ చేస్తూ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
తాజాగా ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల రాష్ట్ర ప్రజల కలల గురించి ప్రస్తావించగా.. ఎంపి షణ్ముగం షణ్ముగం మాట్లాడుతూ.. నాకు నయనతార కావాలి, నా కలను నెరవేరుస్తారా? అంటూ తీచౌకబారు వ్యాఖ్యలు చేశారు.
బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఒక నటిని ఉద్దేశించి ఇంతటి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే మరో అగ్రనటి త్రిషపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకుడిగా మారిన నటుడు విజయ్‌ను విమర్శించే క్రమంలో ఆయన అసందర్బంగా, అనుచితంగా త్రిష పేరు ప్రస్తావించారు. విజయ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులు చూడాలంటూ త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి.
సినిమా రంగంలో తమకంటూ గుర్తింపును, గౌరవాన్న, అశేష ప్రేక్షకాభిమానాన్నీ సంపాదించుకున్న నటీమణులపై ఇటువంటి అసభ్య, అసందర్భ వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల వారి విధానాలను ఎండగడుతూ విమర్శలు చేయాలి కానీ, సంబంధం లేని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం సరికాదని అంటున్నాయి.
కాగా ఎంపీ షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార పర్వంలో ఇంకా ఎలాంటి విమర్శలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమౌతోంది.



.webp)


