Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు డీవీఏసీ డైరక్టర్ పై బదలీ వేటు.!
posted on: Jul 14, 2026 9:59AM

తమిళనాడు అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) డైరెక్టర్ అరుణ్ పై విజయ్ సర్కార్ వేటు వేసింది. డీవీఏసీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ. అరుణ్‌పై కే బదిలీ వేటు పడింది. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో టీవీకే విజయం సాధించి విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఎ. అరుణ్‌ను డీవీఏసీ చీఫ్‌గా నియమితులయ్యారు. అయితే.. ఏడీజీపీ ర్యాంక్ అధికారి అయిన అరుణ్ నియామకం తొలి నుంచీ వివాదంగానే మారింది.
గతంలో ఆయన చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో అప్పటి అధికార పక్షమైన డీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో టీవీకే సహా పలు ఇతర రాజకీయ పార్టీలు ఆయన వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా అరుణ్ పరిపాలనాపరమైన వివక్ష చూపించారనే ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను పక్కన పెట్టింది. అలాంటి వివాదాస్పద అధికారిని ఏకంగా అవినీతి నిరోధక శాఖాధిపతిగా అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడంపై విజయ్ సర్కార్ పై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అరుణ్ నియామకంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అరుణ్ నియమకంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మద్రాస్ హఐకోర్టు.. అవినీతిని నిరోధించే ఒక కీలక వ్యవస్థకు అధిపతిగా ఉండే వ్యక్తికి సచ్ఛీలమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలని వ్యాఖ్యానించింది.
కోర్టు ఇచ్చిన ఈ తీవ్రమైన మొట్టికాయలు, చుట్టుముట్టిన న్యాయపరమైన ఒత్తిళ్లు మరియు ప్రతిపక్షాల నుండి వస్తున్న తీవ్రమైన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి విజయ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ కె. మణివాసన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎ. అరుణ్‌ను డీవీఏసీ చీఫ్ బాధ్యతల నుండి బదిలీ చేసి, చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పంపించారు.
ఆయన స్థానంలో ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ర్యాంక్ అధికారిణి సి. మహేశ్వరి ఐపీఎస్‌ను డీవీఏసీ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నూతన చీఫ్‌గా నియమించారు. కేవలం 60 రోజుల్లోనే ఒక పవర్‌ఫుల్ విభాగం హెడ్ బదిలీ కావడం విజయ్ ప్రభుత్వ పాలనా శైలికి, కోర్టుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Vijay Government Tamil Nadu, C Maheswari IPS, Madras High Court Verdict, Tamil Nadu Bureaucracy, IPS Transfer News






